కర్నూలులోనే ఎస్ఏఐ హాస్టల్ కొనసాగించాలని డీవైఎఫ్ఐ డిమాండ్

1చూసినవారు
కర్నూలులోనే ఎస్ఏఐ హాస్టల్ కొనసాగించాలని డీవైఎఫ్ఐ డిమాండ్
కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌ను తిరుపతికి తరలించే ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. గురువారం కొత్త బస్టాండ్ సమీపంలోని డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా, ఉపాధ్యక్షులు హుస్సేన్ బాషా ఈ డిమాండ్ చేశారు. 1998లో ప్రారంభమైన ఈ హాస్టల్ ఇప్పటివరకు కర్నూలులోనే కొనసాగుతోందని, రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారని వారు తెలిపారు. భవనం పాడైందన్న కారణంతో హాస్టల్‌ను తరలించడం సరికాదని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్