ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఆదివారం బి.క్యాంపులో ఉన్న ఏపీజీఈఏ కార్యాలయంలో ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి జె.సుదర్శన్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా బంగి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా సురేశ్ రెడ్డి ఎన్నికయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మరో 19 మందితో వారు ప్రమాణ స్వీకారం చేయించారు.