ఆదోనిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

0చూసినవారు
ఆదోనిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆదోని మండలం పాండవగల్లు శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. గణేకల్లుకు చెందిన యువకులు బైకుపై వెళ్తూ ముందు ఉన్న ఆటోను ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మహేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా, వీరేశ్‌తో పాటు ఆటోలో ఉన్న మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై పెద్దతుంబళం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్