కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అగ్నిప్రమాదం

3చూసినవారు
కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అగ్నిప్రమాదం
కర్నూలులోని కల్లూరులో గల కోటేశ్వరరావు సిల్వర్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఫ్యాక్టరీ కార్మికుడు జంగాల ప్రసాద్ (22)కు స్వల్ప గాయాలయ్యాయి. అతడి ఎడమ చెవి పాక్షికంగా కాలిపోవడంతో చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్