కర్నూలులో అగ్నిప్రమాదం: రూ.40 లక్షల ఆస్తి నష్టం

2చూసినవారు
కర్నూలులో అగ్నిప్రమాదం: రూ.40 లక్షల ఆస్తి నష్టం
కర్నూలులో నిన్న జరిగిన అగ్ని ప్రమాదాల్లో సుమారు రూ.40 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. బాలాజీ నగర్‌లోని కూలర్ల తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 500 కూలర్లు కాలిపోయి రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. చెన్నమ్మ సర్కిల్‌లో ప్రభాస్ DJ డెకరేషన్ సప్లయర్ షాప్‌లో మంటలు చెలరేగి 2 జనరేటర్లు, 2 DJ సెటప్‌లు, ఫోక్ లైట్స్, 350 చైర్లు, సప్లై సామగ్రి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.25 లక్షల నష్టం వాటిల్లినట్లు ఓనర్ అయ్యస్వామి తెలిపారు.

సంబంధిత పోస్ట్