కర్నూలులో మాజీ కార్పొరేటర్ అరెస్టు.. బెయిల్ మంజూరు

5చూసినవారు
కర్నూలులో మాజీ కార్పొరేటర్ అరెస్టు.. బెయిల్ మంజూరు
కర్నూలు నగరంలోని 26వ వార్డు మాజీ కార్పొరేటర్, వైఎస్సార్‌సీపీ నాయకుడు దండు లక్ష్మీకాంతరెడ్డిని నాలుగో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఏప్రిల్ 28న విఠల్‌నగర్‌లోని సవారమ్మకాలనీలో రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుని, స్థానికుడు నరేష్‌తో ఘర్షణ పడినట్లు పోలీసులు తెలిపారు. నరేష్ ఫిర్యాదుతో లక్ష్మీకాంతరెడ్డి, అనుచరుడు మల్లికార్జునపై కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరచగా, వారికి బెయిల్ మంజూరైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్