వేసవి సెలవుల నేపథ్యంలో ట్రావెల్స్ ఏజెన్సీల పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీల పేరుతో తక్కువ ధరల్లో దేశీయ, విదేశీ పర్యటనలు అందిస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయని ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా ప్రకటనలు ఇస్తూ ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్యాకేజీలు అందిస్తామని నమ్మిస్తున్నారని, అడ్వాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి, తరువాత సంప్రదింపులు నిలిపివేయడం, నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ రివ్యూల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.