జీజీహెచ్‌లో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

కర్నూలు జీజీహెచ్‌లో అక్రమంగా తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు పీఎస్ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం సీఐటీయూ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మెడికల్ అండ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కక్షసాధింపు చర్యల్లో భాగంగా తొలగించారని ఆరోపించారు. ఎంఓయూలో చట్టవిరుద్ధంగా చేర్చిన 50 సంవత్సరాలు పైబడిన వారిని తొలగించే నిబంధనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
