75 ఏళ్ల వృద్ధురాలి కడుపులో 10 కిలోల కణితి తొలగింపు: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల అద్భుతం

10చూసినవారు
75 ఏళ్ల వృద్ధురాలి కడుపులో 10 కిలోల కణితి తొలగింపు: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల అద్భుతం
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు 75 ఏళ్ల సుబ్బ లక్ష్మమ్మ అనే వృద్ధురాలి కడుపులోంచి 10 కిలోల అండాశయ కనితిని విజయవంతంగా తొలగించి అబ్బురపరిచారు. గత ఆరు నెలలుగా కడుపునొప్పి, ఉబ్బరంతో బాధపడుతున్న ఆమె, అనేక ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో మే 1న కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. వైద్యులు స్కానింగ్ లో 30x25 సెం.మీ. పరిమాణంలో భారీ గడ్డను గుర్తించారు. 75 ఏళ్ల వయస్సులోనూ వైద్య బృందం ధైర్యంగా శస్త్రచికిత్స నిర్వహించి, గంటల తరబడి సాగిన ఆపరేషన్ లో కనితిని విజయవంతంగా తొలగించింది. ప్రస్తుతం సుబ్బ లక్ష్మమ్మ కోలుకుంటున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ విజయం పట్ల క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ వైద్య బృందాన్ని అభినందించారు.

సంబంధిత పోస్ట్