కర్నూలుకు చెందిన ట్రావెల్స్ బస్సు (AP39WA5008) నంద్యాల అమకతాడు టోల్ ప్లాజా వద్ద బుధవారం రాత్రి తనిఖీలలో రోడ్ ట్యాక్స్ చెల్లించకుండా బెంగళూరు వెళ్లి తిరిగి వస్తుండగా పట్టుబడింది. డోన్‌కు ఎంవీఐ టి. క్రాంతి కుమార్ కేసు నమోదు చేసి రూ.4,67,750 భారీ జరిమానా విధించారు. అనంతరం బస్సును డోన్ ఆర్టీసీ డిపోకు తరలించారు. ప్రతి వాహనానికి రోడ్డు టాక్స్ తో పాటు ఇన్సూరెన్స్ లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలని సూచించారు.