కర్నూలు నగర శివారులోని జొహరాపురం ఇందిరమ్మ గృహాల సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఒకటో పట్టణ సీఐ మారుతి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో, మైదుకూరు వెంకటేష్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు అందర్ బాహర్ జూదం ఆడుతున్నట్లు గుర్తించి, వారి వద్ద నుంచి రూ. 13,920 నగదు, మూడు సెల్‌ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.