కర్నూలు: 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: సిఐటియు

942చూసినవారు
మే డే స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన లారీ హమాలి, కోత అంగడి గుమాస్తాల యూనియన్ల సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని నాయకులు విమర్శించారు.

సంబంధిత పోస్ట్