కర్నూలు: డయల్ యువర్ సిఎండి‌కు 62 వినతులు

0చూసినవారు
కర్నూలు: డయల్ యువర్ సిఎండి‌కు 62 వినతులు
ఎపిఎస్పిడిసిఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి' కార్యక్రమానికి 62 వినతులు అందినట్లు చైర్మన్, ఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, 9 జిల్లాల వినియోగదారులు విద్యుత్ సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చి, వాటి పరిష్కారం కోసం విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ మార్పు, లో-ఓల్టేజ్, స్తంభాల మార్పు, వ్యవసాయ కనెక్షన్ జాప్యం వంటి సమస్యలున్నాయని, మొత్తం 265 వినతుల్లో 118 సమస్యలు పరిష్కారం అయ్యాయని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్