కర్నూలు: ఏఆర్‌టి వాడితే ఆరోగ్యమైన జీవితం సాధ్యం: కలెక్టర్

7చూసినవారు
కర్నూలు: ఏఆర్‌టి వాడితే ఆరోగ్యమైన జీవితం సాధ్యం: కలెక్టర్
కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సోమవారం ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా మాట్లాడుతూ, హెచ్ఐవితో జీవిస్తున్నవారు అధైర్యపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏ. ఆర్. టి. మందులు సక్రమంగా వాడితే ఆరోగ్యంగా, దీర్ఘకాలం జీవించవచ్చని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో హెచ్ఐవి ఇన్సిడెన్స్ 0.57% కాగా, 7 వేల మంది ఏ. ఆర్. టి. తీసుకుంటున్నారని, బాధితుల పట్ల మానవీయతతో వ్యవహరించాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :