కర్నూలు: జర్నలిస్టులకు రక్షణ చట్టం తీసుకురావాలి

2చూసినవారు
కర్నూలు: జర్నలిస్టులకు రక్షణ చట్టం తీసుకురావాలి
రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ కల్పించే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య, రాష్ట్ర సమాచార హక్కు పరిరక్షణ వేదిక అధ్యక్షుడు ఎన్. కే. జయన్నలు బుధవారం కర్నూలులో డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో ఇంచార్జ్ డీఆర్ఓ చిరంజీవిని కలిసి వినతిపత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ హత్య ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు, కేసులు, హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్