శనివారం తెలంగాణ రాష్ట్రంలోని మర్రి చెన్నారెడ్డి మానవవరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 15 మంది అఖిల భారత సర్వీసుల అధికారులు కర్నూలు కలెక్టర్ డా. ఏ. సిరిని కలిశారు. ఈ సందర్భంగా, అఖిల భారత సర్వీసుల అధికారులుగా దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సాధ్యమైనంతవరకు ప్రజలకు మంచి చేయాలని కలెక్టర్ సూచించారు. అధికారులు 1 నుండి 8వ తేదీ వరకు జిల్లా కార్యకలాపాలను పరిశీలించడంతో పాటు, పెద్దటేకూరు, హుసేనాపురం, గార్గేయపురం, కర్నూలు మున్సిపాలిటీ ప్రాంతాల్లో పర్యటన చేపడతారు.