కర్నూలు: ఏఐఎల్యూ ఆధ్వర్యంలో ఏఐబీఈ మోడల్ ఎగ్జామ్ పేపర్ విడుదల

38చూసినవారు
కర్నూలు: ఏఐఎల్యూ ఆధ్వర్యంలో ఏఐబీఈ మోడల్ ఎగ్జామ్ పేపర్ విడుదల
కర్నూలు నగరంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏఐబీఈ మోడల్ ఎగ్జామ్ పేపర్‌ను కర్నూల్ స్పెషల్ ఫోక్సో కోర్టు జడ్జి ఈ. రాజేంద్ర బాబు మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ విద్యార్థులు, న్యాయవాదులు ఏఐబీఈ పరీక్షకు సమగ్రంగా సిద్ధం కావడానికి ఇటువంటి మోడల్ పరీక్షలు ఉపయోగపడతాయని తెలిపారు. ఏఐఎల్యూ రాష్ట్ర అధ్యక్షులు కె. కుమార్ మాట్లాడుతూ న్యాయ విద్యార్థుల్లో పోటీ పరీక్షలపై అవగాహన పెంచడం, మెరుగైన ఫలితాలు సాధించేలా మార్గనిర్దేశం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్