మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగస్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని కర్నూలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రసన్నలక్ష్మి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా యువజన సంక్షేమ శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అల్లూరి వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో అల్లూరి చెరగని ముద్ర వేసిన మహనీయుడని, గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ పాలకుల దమనకాండకు ఎదురు నిలిచి ప్రాణత్యాగం చేసిన యోధుడని ప్రసన్నలక్ష్మి కొనియాడారు.