కర్నూలు: యూనివర్సిటీలో ఆరోపణలపై విచారణ జరపాలి
కర్నూలు నగరంలోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో విద్యార్థి శివ గణేష్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని కోరుతూ, రాయలసీమ ఉద్యమ యువ నాయకుడు సీమకృష్ణ రాథోడ్‌తో కలిసి బాధితుడు సోమవారం ఉపకులపతికి వినతిపత్రం అందించారు. ఫేక్ ఏఐఎస్ఎఫ్ లీడర్ శరత్ అసత్య ప్రచారం, బ్లాక్మెయిల్ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ జరపకపోతే విశ్వవిద్యాలయాన్ని ముట్టడించి, హ్యూమన్ రైట్స్‌లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
