కర్నూలు మెడికల్ కాలేజీ డిప్లొమా ఇన్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ సర్వీసెస్ (డిప్లొమా ఇన్ పారామెడికల్) కోర్సులో మిగిలిన సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. చిట్టినరసమ్మ తెలిపిన వివరాల ప్రకారం, బీసీ-ఏ, ఓసీ-పీహెచ్ విభాగాల్లో ఒక్కో సీటు, డీఎఎన్‌ఎస్ ఓసీ-పీహెచ్ కు ఒక్కో సీటు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 7 సాయంత్రం 5 గంటలలోపు కళాశాల కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.