కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో నిర్వహించిన జాతీయ టీబి నిర్మూలన కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొని మాట్లాడారు. క్షయ వ్యాధి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని, వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే పక్క వారిని కూడా కబళిస్తుందన్నారు. సరైన జాగ్రత్తలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా మందు వాడితే వ్యాధిని నిర్మూలించవచ్చని ఎంపీ తెలిపారు.