కర్నూలులో శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా జడ్జి జి. కబర్థి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి ర్యాలీని ప్రారంభించారు. న్యాయసేవ సదన్ నుండి కొండారెడ్డి బురుజు వరకు సాగిన ఈ ర్యాలీలో, జిల్లా జడ్జి హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. న్యాయవాదులు, పోలీసులు, వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.