ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి బస్సు దగ్ధమైంది. ఈ ఘటనపై దుష్ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదుతో కర్నూలు తాలుకా అర్బన్ పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరిలో ఆరే శ్యామల, సీవీ రెడ్డి, కందుకూరి గోపికృష్ణ, వైసీపీ అధికార ఎక్స్ పేజీ నిర్వాహకులు కూడా ఉన్నారు.