కర్నూలు: మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై కేసు నమోదు

1చూసినవారు
కర్నూలు: మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై కేసు నమోదు
వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు కర్నూలు త్రీటౌన్ పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈనెల 14న కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో సీఐ శేషయ్యను ఉద్దేశించి రాజా దురుసుగా మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వస్తే సీఐ శేషయ్యను యూనిఫాం లేకుండా నిలబెడతామని దూషించినట్లు ఆరోపణలున్నాయి.

సంబంధిత పోస్ట్