కర్నూలు: మంత్రి ఫొటో దుర్వినియోగం… వ్యక్తిపై కేసు నమోదు

4చూసినవారు
కర్నూలు: మంత్రి ఫొటో దుర్వినియోగం… వ్యక్తిపై కేసు నమోదు
మంగళవారం, కర్నూలుకు చెందిన సాన నర్సింహ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక శ్రీరామనగర్‌కు చెందిన సతీష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి, ఐటీడీపీ అధ్యక్షుడు గట్టు తిలక్ వేధింపులే కారణమని ఆరోపిస్తూ, సతీష్ మృతదేహం ఫొటోకు గట్టు తిలక్, మంత్రి టీజీ భరత్‌తో కలిసి దిగిన ఫొటోను జతచేసి సామాజిక మాధ్యమాల్లో దురుద్దేశంతో పోస్టు చేశాడు. ఈ ఘటనపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో పలు చట్టాల కింద కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్