నెల్లూరులో ప్రజానాట్యమండలి కళాకారుడు పెంచలయ్యను గంజాయి ముఠా హత్య చేసిన ఘటనపై బుధవారం కర్నూలు కలెక్టరేట్ వద్ద పౌర సంక్షేమ సంఘం ఆందోళన చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాల వ్యాపారాలపై సీబీఐ విచారణ జరిపించాలని పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు జే. దివాకర్, పుల్లారెడ్డి, నాగరాజు తదితరులు డిమాండ్ చేశారు. పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.