కర్నూలు: అభివృద్ధికి జనగణన దోహదం: జేసీ నూరుల్ కమర్

3చూసినవారు
కర్నూలు: అభివృద్ధికి జనగణన దోహదం: జేసీ నూరుల్ కమర్
దేశాభివృద్ధిలో జనగణన కీలకమని కర్నూలు జిల్లా జేసీ నూరుల్ కమర్ అన్నారు. ఆదివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన 5కె రన్‌ను జేసీ నూరుల్ కమర్, కమిషనర్ చల్లా ఓబులేసు జెండా ఊపి ప్రారంభించారు. పురుషుల విభాగంలో మనీష్, గోవింద్, వెంకట్ భరత్; మహిళల విభాగంలో రేణుక, సోనాక్షి, రామలక్షి విజేతలుగా నిలిచారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :