కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉందని ఆరోపిస్తూ ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బళ్లారి చౌరస్తాలోని ఎంజీ పెట్రోల్ బంకు ముందు ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్ యూనియన్ న్యూ సిటీ కమిటీ ధర్నా నిర్వహించింది. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, కోశాధికారి ఎం. గోపాల్ మాట్లాడుతూ, జిల్లాలోని అనేక పెట్రోల్ బంకులు 'నో స్టాక్' బోర్డులతో మూతపడ్డాయని, కొద్ది బంకుల్లోనే ఇంధనం లభించడంతో వాహనదారులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోందని తెలిపారు.