కర్నూలు నగరంలో ప్రధాన కూడళ్లను సుందరీకరించడంతో పాటు అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె నగరంలోని బంగారుపేట, ఎన్ఆర్ పేట, ఉల్చాల వై జంక్షన్, బళ్లారి చౌరస్తా, కిడ్స్ వరల్డ్ పార్క్, కేసీ కెనాల్ పరిసరాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. మెరిడియన్ వద్ద మొక్కల సుందరీకరణ, నూతన మున్సిపల్ కార్యాలయం నిర్మాణం, బస్టాండ్ అనుసంధాన రోడ్డు పనులను ఆమె సమీక్షించారు.