కర్నూలు: క్లాప్ డ్రైవర్లకు 4 నెలల జీతాలు చెల్లించాలి

14చూసినవారు
కర్నూలు: క్లాప్ డ్రైవర్లకు 4 నెలల జీతాలు చెల్లించాలి
కర్నూలు నగరంలో పనిచేస్తున్న స్వచ్ఛ ఆంధ్ర క్లాప్ డ్రైవర్లకు నాలుగు నెలలుగా పెండింగ్ జీతాలు చెల్లించాలని, ఉపాధి కల్పించాలని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. జీతాలు అందక క్లాప్ డ్రైవర్లు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. నగర పరిశుభ్రతకు కీలకంగా పనిచేస్తున్న వీరి కృషిని గుర్తించి, వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు.

సంబంధిత పోస్ట్