త్వరలో జరగబోయే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ నేత ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు ఈ డిమాండ్ చేశారు. జనాభాలో సగం ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్లు, ప్రత్యేక రక్షణ చట్టం, విద్యార్థులకు 100% ఫీజు రీయింబర్స్మెంట్, కుల గణన ఆధారిత బడ్జెట్ కేటాయింపులు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ సమావేశంలో బత్తుల లక్ష్మీకాంతయ్య, అయ్యన్న యాదవ్ పాల్గొన్నారు.