కర్నూలు: అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి

కూటమి ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి కట్టుబడి ఉందని కూటమి ఎస్సీ జేఏసీ ఛైర్మన్ కాశపోగు గిడ్డన్న తెలిపారు. శనివారం కర్నూలులో మాట్లాడుతూ, డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సహాయం, ఆయన కుమారుడికి డిప్యూటీ తహశీల్దార్‌గా స్పెషల్ ప్రమోషన్ ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలకు ఇది పరిహారమని, కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
