కర్నూలు: గార్బేజ్ ఫ్రీ సిటీపై కమిషనర్ ప్రత్యేక దృష్టి

966చూసినవారు
కర్నూలు: గార్బేజ్ ఫ్రీ సిటీపై కమిషనర్ ప్రత్యేక దృష్టి
కర్నూలు నగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. గురువారం వెంకటరమణ కాలనీ, అమీర్ హైదర్ నగర్, సంకల్ బాగ్, ప్రకాష్ నగర్, ధర్మపేట ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గార్బేజ్ పాయింట్లు ఏర్పడకుండా కఠిన నిఘా ఉంచాలని, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా చెత్త వేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య సిబ్బంది సమయాన్ని వృథా చేయకుండా ఇంటింటి చెత్త సేకరణ, రహదారుల శుభ్రత పనులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్