కర్నూలు: పట్టణాల అభివృద్ధిలో కమిషనర్లే కీలకం

1చూసినవారు
కర్నూలు: పట్టణాల అభివృద్ధిలో కమిషనర్లే కీలకం
రాష్ట్ర పురపాలక శాఖ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సిడిఎంఏ) పి. సంపత్ కుమార్, ఐఏఎస్ శుక్రవారం కర్నూలులో జిల్లా మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణాల అభివృద్ధిలో కమిషనర్లదే కీలకపాత్ర అని ఆయన అన్నారు. కమిషనర్లు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అంతకుముందు గార్గేయపురం, జొహరాపురం డంప్ యార్డుల్లో బయో మైనింగ్, సి అండ్ డి వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్