కర్నూలు: భవననిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి

1చూసినవారు
కర్నూలు: భవననిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించి, సంక్షేమ పథకాలను అమలు చేయాలని సిఐటియు నాయకులు కోరారు. కర్నూలులో బుధవారం ఎలక్ట్రికల్, కార్పెంటర్, గౌండ, పెయింటర్స్ కార్మికులతో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, పెన్షన్, బీమా, వివాహ, మరణ, ప్రసూతి సౌకర్యాలను సకాలంలో అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్