కర్నూలు: కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి – సీఐటీయూ

0చూసినవారు
కర్నూలు: కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి – సీఐటీయూ
ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్వీపర్స్, స్కావెంజర్స్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని సీఐటీయూ నగర కర్నూలు ప్రధాన కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు. మేడే స్ఫూర్తితో కార్మికులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బుధవారం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ పార్కులో నిర్వహించిన కాంట్రాక్ట్ స్వీపర్స్, స్కావెంజర్స్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి యూనియన్ నాయకుడు దేవరాజు అధ్యక్షత వహించారు. ఆర్టీసీలో 20 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం కూడా అమలు కావడం లేదని నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్