కర్నూలు జిల్లాలోని కేజీబీవీల్లో నిర్లక్ష్యం, అవినీతి అధికమైందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, జిల్లా అధ్యక్షుడు సాయి ఉదయ్ ఆదివారం కర్నూలులో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతున్నా అధికారులు స్పందించకపోవడం విచారకరమని, ఈ పరిస్థితులకు బాధ్యులైన జిసిడిఓ స్నేహలత, ఇన్‌చార్జి శామ్యూల్ పాల్‌లను తక్షణమే సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.