కేరళ మాజీ ముఖ్యమంత్రి పీనరై విజయన్ నివాసంపై ఈడీ సోదాలు నిర్వహించడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. సీపీఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పీఎస్ రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై ఈడీ సోదాలు ప్రజాస్వామ్యంపై దాడి అని, దీనివెనుక
బీజేపీ రాజకీయ కుట్ర ఉందని విమర్శించారు. కేరళ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.