కర్నూలు: స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సిపిఎం ఆందోళన

61చూసినవారు
కర్నూలు: స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సిపిఎం ఆందోళన
కర్నూలు మండల సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని, ట్రూ అప్, సర్దుబాటు పేరుతో పెంచిన విద్యుత్ భారాలు తగ్గించాలని, ఇప్పటికే పెట్టిన మీటర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సిపిఎం నాయకులు హుస్సేనయ్య, రాఘవేంద్ర, శ్రీరాములు, నరసింహులు, ఆంజనేయులు, ఇతర ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్