నెల్లూరులో గంజాయి వ్యతిరేక పోరాటం చేసిన సీపీఎం నాయకుడు పెంచలయ్య హత్య కేసులో టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కర్నూలులో ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల నిరసన చేపట్టారు. సీఐటీయూ నాయకులు అంజిబాబు, రాధకృష్ణ మాట్లాడుతూ, టీడీపీ నాయకులు గంజాయిని ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు.