కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలు మోపుతోందని సీపీఎం రాష్ట్ర కమిటీ వర్గ సభ్యురాలు పి. నిర్మల విమర్శించారు. గురువారం ఆమె మాట్లాడుతూ, పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 6న సదస్సు, 9న రాస్తారోకో నిర్వహించనున్నట్లు తెలిపారు. కర్నూలు నగరంలో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఆమె, మే నెలలో కేవలం 11 రోజుల్లోనే నాలుగుసార్లు ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.