కర్నూలు జిల్లా కె.శింగవరంలో జరిగిన హత్య కేసులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఉగాది పండుగ సందర్భంగా బోయ సొట్టనాగన్న ఇంటికి రంగులు వేయడానికి వెళ్లిన మల్లికార్జున(27)తో, అతని తల్లి భాగ్యమ్మతో నాగన్న అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తల్లి తన కొడుకుకు చెప్పడంతో, శుక్రవారం శ్రీరామనవమి వేడుకల్లో నాగన్నతో మల్లికార్జున ఘర్షణ పడ్డాడు. ఈ సంఘటనతో కక్ష పెంచుకున్న నాగన్న, అతని కుమారులతో కలిసి ఈర్లదిన్నె వద్ద మల్లికార్జునను పొలాల్లోకి తీసుకెళ్లి నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.