గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువత డీడీయూ-జీకేవై 2. 0 ద్వారా అందిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో శిక్షణ కార్యక్రమాల ప్రచార పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. కస్టమర్ ఇంగ్లీష్, హాస్పిటాలిటీ, టెలికాం, గ్రీన్ జాబ్స్ రంగాల్లో 18-35 ఏళ్ల యువతకు ఉచిత శిక్షణతో పాటు ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. నైపుణ్యాల పెంపుదల ద్వారా యువత ఆర్థికంగా స్వావలంబన సాధించడంతో పాటు తమ కుటుంబాల అభివృద్ధికి తోడ్పడగలరని కలెక్టర్ అన్నారు.