కర్నూలు: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆధునిక వసతుల అభివృద్ధి

13చూసినవారు
కర్నూలు: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆధునిక వసతుల అభివృద్ధి
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కర్నూలు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో అవసరమైన పరికరాలు, మౌలిక వసతులను అభివృద్ధి చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదివారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల సహకారంతో ఆస్పత్రి అభివృద్ధికి కృషి కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, ఆస్పత్రికి అవసరమైన 75 మైక్రోస్కోపులను రూ. 37 లక్షల వ్యయంతో కొనుగోలు చేసి ఫిజియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భద్రత కోసం కిటికీలకు ఫిక్స్‌డ్ మెష్‌లు అమర్చడం, చిన్నపాటి సివిల్ పనులు నిర్వహించడం కూడా జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్