వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) కర్నూలు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్‌టీఏ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి పరీక్షల్లో పారదర్శకత పెంచాలని వారు కోరారు.