కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. పెట్రోల్ బంకుల వద్ద సరఫరా నిలిచిపోవడం, భారీ క్యూలు, అధిక ధరలు వసూలు చేస్తున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు. ఇది సహజ కొరత కాదని, వ్యాపార వర్గాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమస్యను తక్షణమే నివారించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి. ఎస్. రాధాకృష్ణ, ఎం. డి. ఆనంద్ బాబు, టి. రాముడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నగరంలోని సుందరయ్య భవన్‌లో వారు మీడియాతో మాట్లాడారు.