కర్నూలులో వైఎస్సార్సీపీలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. బుధవారం నగర పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ఏర్పాట్లు చేసినా కొందరు అడ్డుకున్నారని నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ ఆరోపించారు. జిల్లా పార్టీ ఆఫీసుకు తనను ఆహ్వానించలేదని, వెళ్లినా మర్యాద ఉండదని వ్యాఖ్యానించారు. వైరల్ ఆడియోలో ఉన్నట్లు తాను మాట్లాడలేదని, వాయిస్ నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు.