కర్నూలు: సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ ప్రమాదకరం: జిల్లా ఎస్పీ

6చూసినవారు
కర్నూలు: సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ ప్రమాదకరం: జిల్లా ఎస్పీ
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం మాట్లాడుతూ, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్లు ధరించాలని, సెల్‌ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, వేగంగా నడిపి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో అమాయక ప్రజలు రోడ్డు ప్రమాదాలకు బలికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్