కర్నూలు: కార్తీక దీపోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

4చూసినవారు
కర్నూలు: కార్తీక దీపోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు నగరంలోని కేసీ కెనాల్ వినాయక ఘాట్ వద్ద బుధవారం జరగనున్న కార్తీక దీపోత్సవానికి నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఘాట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించి, వేలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రజా సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. ఘాట్ ప్రాంగణంలో లైటింగ్, వేదిక, సౌండ్ సిస్టం, తాగునీరు, పారిశుద్ధ్యం, గజ ఈతగాళ్లు వంటి భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.