శుక్రవారం కర్నూలులో యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఈ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. డి అంజిబాబు మాట్లాడుతూ, కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ కో, జెన్కో, డిస్కం కార్మికులకు అన్లిమిటెడ్ వైద్యం, కోటి రూపాయల ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఫీల్డ్ అసిస్టెంట్‌లకు సమాన వేతనం కల్పించాలని కోరారు.